1, జులై 2014, మంగళవారం

పాకాల సరస్సు (Pakala Lake)

పాకాల సరస్సు
జిల్లావరంగల్ జిల్లా
మండలంఖానాపూర్ మండలం
నిర్మాణకాలంక్రీ శ.1213
నిర్మాతముమ్మడినాయకుడు
పాకాల సరస్సు వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉంది ఇది నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరంలో ఉంది. ఈ సరస్సును క్రీ శ.1213 లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో చే కట్టించబడింది. చెరువు విస్తీర్ణం సుమారు 30 చకిమీ. సరస్సు చుట్టూ ఉన్న అభయారణ్యం మరియు ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ చెరువు మధ్యలో అద్బుతమైన కొండ ఉంది. "పాకాల రామక్క గుండం" గా పిలవబడే ప్రదేశం లో ప్రజలు మొక్కులు సమర్పిస్తూ ఉంటారు. కోతులు,కొండముచ్చులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. చుట్టూ ప్రక్కల ఉన్న అడవిలో చిరుత పులులు, జింకలు, దుప్పులు, అడవి పందులు విరివిగా ఉన్నాయి.

గణపతిదేవుని మంత్రి అయిన బయ్యన నాయకుని కుమారుడు ముమ్మడినాయకుడు పాకాల చెరువు నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ చెరువు నుంచే మున్నేరు నది జన్మించి అది దాదాపు 100 మైళ్ళు ప్రవహించి కృష్ణానదిలో సంగమిస్తుంది. ఈ చెరువుకు 3 తూములున్నాయి. ఈ చెఱువు కింద 10 వేల ఎకరాలు సాగు భూములున్నాయి. చెరువు గరిష్ట నీటి సామర్థ్యం 30 అడుగులు.

పాకాల చెరువులో జన్మిస్తున్న మున్నేరు నది ఖానాపూర్, నర్సంపేట, చెన్నరావుపేట, గూడూరు, మానుకోట, బయ్యారం, డోర్నకల్ మండలాల్లో ప్రవహిస్తూ ఖమ్మం జిల్లాలోకి అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో చేరి నందిగామ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

విభాగాలు: వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలము, క్రీ.శ.13వ శతాబ్దం, కాకతీయ సామ్రాజ్యం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక