25, సెప్టెంబర్ 2014, గురువారం

శ్రీకాకుళం జిల్లా (Srikakulam Dist)

 శ్రీకాకుళం జిల్లా
వైశాల్యం5837 చకిమీ
జనాభా27,03,114 (2011)
మండలాలు38
అసెంబ్లీ నియోజకవర్గాలు10
శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు 13 జిల్లాలలో ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతి తూర్పున ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దులో ఉన్నది. జిల్లా వైశాల్యం 5837 చకిమీ. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు కలవు. శ్రీకాకుళం, ఆముదాలవలస, టెక్కలి, నర్సాపురం, రాజాం, పలాస జిల్లాలోని ముఖ్య పట్టణాలు. 5వ నెంబరు (కోల్‌కత-చెన్నై) జాతీయ రహదారి, చెన్నై-కోల్‌కత రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుతుంది. జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉంది. అరసవిల్లి, శ్రీకూర్మం, కళింగపట్నం లాంటి పర్యాటకక్షేత్రాలు జిల్లాలో కలవు. 1930కు ముందు ఒరిస్సాలో ఉన్న ఈ ప్రాంతం 1930లో మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనమై, 1953లో ఆంధ్రరాష్ట్రంలోనూ, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతోంది. ప్రముఖ రచయితలు గిడుగు రామమూర్తి పంతులు, గరిమెళ్ళ సత్యనారాయణ, రావిశాస్త్రి, సమరయోధుడు గౌత్తులచ్చన్న, ప్రముఖ క్రీడాకారులు కోడి రామ్మూర్తినాయుడు, కరణం మల్లేశ్వరి, రాజకీయ నాయకులు కింజరాపు ఎర్రన్నాయుడు, ప్రతిభా భారతి, పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లికార్జునరావు ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు.

భౌగోళికం, సరిహద్దులు:
శ్రీకాకుళం జిల్లా 18°20’ నుంచి 19°10’ ఉత్తర అక్షాంశం మరియు 83°50’ నుంచి 84°50’ తూర్పు రేఖాంశం వరకు విస్తరించియుంది. జిల్లాకు 193 కిలోమీటర్ల విశాలమైన తీరప్రాంతం ఉంది. భౌగోళికంగా త్రిభుజాకారంలో ఉన్న ఈ జిల్లాకు ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన విజయనగరం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. నాగావళి, వంశధార నదులు ఈ జిల్లాలో ప్రవహించే ముఖ్యనదులు.

అరసవిల్లి సూర్యదేవాలయం
చరిత్ర:
ప్రాచీన కాలంలో కళింగరాజ్యంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత మౌర్యులు, శాతవాహనులు, గాంగరాజులు, గజపతులు తదితరులు పాలించారు. బ్రిటీష్ కాలంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతాన్ని 1930లో మద్రాసు ప్రెసిడెన్సీకి మార్పుచేశారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్రంలో ఉండి 1953లో కొత్తగా అవతరించిన ఆంధ్రరాష్ట్రంలో చేరింది. 1956 నుంచి 2014 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగి, ప్రస్తుతం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నది.

రవాణా సౌకర్యాలు:
చెన్నై నుంచి కోల్‌కత వరకు ఉన్న 5వ నెంబరు జాతీయ రహదారి జిల్లాలో సోంపేట, టెక్కలి, శ్రీకాకుళంల మీదుగా వెళుతుంది. చెన్నై నుంచి కోల్‌కత వరకు ఉన్న రైలుమార్గం కూడా జిల్లా గుండా ఇచ్ఛాపురం, సోంపేట, బారువా, మందస, నౌపాడల మీదుగా వెళ్ళుచున్నది. నౌపాడ జంక్షన్ నుంచి టెక్కలి మీదుగా ఒరిస్సా రాష్ట్రానికి మరో రైలుమార్గం కూడా ఉంది.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక