ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుపొందిన గురజాడ అప్పారావు విశాఖపట్టణం జిల్లా ఎలమంచిలిలో సెప్టెంబరు 21, 1862న జన్మించారు. గురజాడ అప్పారావు కుటుంబం పూర్వీకులు కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చారు. కన్యాశుల్కం నాటకం రచించి పేరు ప్రఖ్యాతులు పొందిన గురజాడ 53 సంవత్సరాల వయసులో నవంబర్ 30, 1915న గురజాడ అప్పారావు మరణించారు.
బాల్యం, విద్యాభ్యాసం: అప్పారావు గారి తండ్రిగారు విజయనగరం సంస్థానంలో పనిచేసారు. తన పదవ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తతండ్రి మరణంతో విజయనగరంకి వచ్చి చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి తర్వాత 1884 లో ఎఫ్.ఏ. చేసారు. ఉద్యోగ ప్రస్థానం: 1984లో ఏం.ఆర్.హై స్కూలులో అప్పారావు ఉపాధ్యాయులుగా చేరారు. విజయనగరంలో బి.ఏ. చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించారు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యత్వం లభించింది. 1913లో పదవీ విరమణ చేశారు. రచనా ప్రస్థానం: గురజాడ గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చారు. 1892 లో గురజాడ వారి "కన్యాశుల్కం" నాటిక వేయబడింది. అది మొదటి సారే ఎంతో పేరు వచ్చింది. 1896 లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టారు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో "కన్యాశుల్కం" తిరిగి వ్రాసారు. 1910 లో "దేశమును ప్రేమించుమన్నా" అన దేశ భక్తీ గీతాన్ని వ్రాసారు, ఇది కూడా ఎంతో పేరు పొందింది. 1911లో స్నేహితులతో కలిసి "ఆంధ్ర సాహిత్యపరిషత్తు" ప్రారంభించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, సెప్టెంబర్ 2014, ఆదివారం
గురజాడ అప్పారావు (Gurajada Apparao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి