22, నవంబర్ 2014, శనివారం

అంతర్జాతీయ వార్తలు-2008 (Internatonal News-2008)

అంతర్జాతీయ వార్తలు-2008 (Internatonal News-2008)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు ఆంధ్రప్రదేశ్ వార్తలు-2008, జాతీయవార్తలు-2008క్రీడావార్తలు-2008,


 • జనవరి 11: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం.
 •  జనవరి 15: అమెరికాలో లూసియానా రాష్ట్రానికి భారత సంతతికి చెందిన పియూష్ బాబీ జిందాల్ 55వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
 • జనవరి 17: చదరంగం క్రీడాకారుడు బాబీ ఫిషర్ మరణించాడు.
 • జనవరి 25: సెనేట్‌ విశ్వాస పరీక్షలో ఓడిపోయినందుకు ఇటలీ ప్రధాన మంత్రి రొమానో ప్రోది పదవికి రాజీనామా చేశాడు.
 • జనవరి 27: ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో మరణించాడు.
 • జనవరి 29: థాయ్‌లాండ్ కొత్త ప్రధానమంత్రిగా సమక్ సుందరవేజ్ ఎన్నికయ్యాడు.
 • ఫిబ్రవరి 19: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా చేశాడు.
 • ఫిబ్రవరి 19: పాకిస్తాన్ ఎన్నికలలో దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
 • ఫిబ్రవరి 25: క్యూబా అధ్యక్షుడిగా ఫిడేల్ కాస్ట్రో సోదరుడు రావుల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
 • మార్చి 3: రష్యా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
 • మార్చి 15: చైనా అధ్యక్షుడిగా మళ్ళీ హు జింటావో ఎన్నిక, ఉపాద్యక్షుడిగా జిన్‌షింగ్ నియామకం.
 • మార్చి 19: పాకిస్తాన్ లోని తక్షశిలలో 2000 సంవత్సరాల నాటి బుద్ధ విగ్రహం లభ్యమైంది.
 • మార్చి 25: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
 • మార్చి 26: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
 • మే 28: నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన ముగిసింది.
 • జూన్ 26: నేపాల్ ప్రధానమంత్రి పదవికి గిరిజా ప్రసాద్ కొయిరాలా రాజీనామా చేశాడు.
 • జూలై 10: సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
 • సెప్టెంబర్ 17: థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
 • సెప్టెంబర్ 27: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించిం
 • సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 


విభాగాలు: వార్తలు, అంతర్జాతీయ వార్తలు, 2008,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక