19, నవంబర్ 2014, బుధవారం

మల్లు స్వరాజ్యం (Mallu Swarajyam)

 మల్లు స్వరాజ్యం
జననం1931
స్వస్థలంకరివిరాల (నల్గొండ జిల్లా)
రంగంతెలంగాణ సాయుధ పోరాటం, రాజకీయాలు,
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కరివిరాల గ్రామంలో 1931లో జన్మించింది. సోదరునితో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకొని సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డీని వివాహం చేసుకొంది. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది. ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. పోరాటం అంతమైన పిదప రాజకీయాలలో ప్రవేశించి 2 సార్లు శాసనసభకు ఎన్నికైనది. వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

సాయుధ పోరాటం:
మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. సాయుధ పోరాటంలో సహచరుడైన మల్లు వెంకట నరసింహారెడ్డిని వివాహం చేసుకున్న ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. ఆమెను పట్టుకున్నవారికి బహుమతి ఇస్తామని కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

రాజకీయ ప్రస్థానం:
హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం ఈమె నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978, 1983లలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం)పార్టీ తరఫున ఎన్నికైంది. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

కుటుంబం:
నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి ఈమెకు సోదరుడు. భర్త మల్లు వెంకట నరసింహారెడ్డి కూడా సాయుధ పోరాటయోధుడు. స్వరాజ్యం కూతురు కరుణ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నల్గొండ లోకసభ స్థానంలో పోటీచేసి ఓడిపోయింది.

విభాగాలు: నల్గొండ జిల్లా సమరయోధులు, నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, 1931లో జన్మించినవారు,


 = = = = =

సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,
 • ఆంగ్ల వికీపీడియా,
 • స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు మహిళలు (రచన: వాసా ప్రభావతి),
 • స్వాతంత్ర్య సమరంలో తెలంగాణ ఆణిముత్యాలు (రచన: మల్లయ్య),

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక