9, డిసెంబర్ 2014, మంగళవారం

షీలాదీక్షిత్ (Sheila Dikshit)

 షీలాదీక్షిత్
జననంమార్చి 31, 1938
రాష్ట్రంపంజాబ్
రంగంరాజకీయాలు
పదవులుకేంద్రమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, కేరళ గవర్నరు,
ప్రముఖ రాజకీయ నాయకురాలైన షీలాదీక్షిత్ మార్చి 31, 1938న పంజాబ్‌లోని కపుర్తాలాలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలాదీక్షిత్ 1998 నుంచి 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నరుగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
1984-89 కాలంలో ఉత్తరప్రదేశ్ లోని కనోజ్ నియోజకవర్గానికి లోకసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. 1986-89 కాలంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1998లో తూర్పు ఢిల్లీ లోకసభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. తర్వాత అదే ఏడాది ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి పొంది 2013 వరకు అధికారంలో ఉన్నారు. ఈ కాలంలో 3 సార్లు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2014 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ స్వయంగా షీలాదీక్షిత్ తనస్థానంలో కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ చేతిలో పరాజయం పొందారు. తర్వాత కేరళ గవర్నరుగా నియామకం పొందిననూ 2014 లోకసభ ఎన్నికల్లఓ భాజపా విజయం సాధించడంతో 5 మాసాలకే గవర్నరు పదవికి రాజీనామా చేశారు.

విభాగాలు: పంజాబ్ ప్రముఖులు, ఢిల్లీ ముఖ్యమంత్రులు, కేరళ గవర్నర్లు, 1938లో జన్మించినవారు, కేంద్రమంత్రులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక