కమ్మర్‌పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్రమంత్రిగా మనిచేసిన ఏలేటి మహిపాల్ రెడ్డి, శాసనసభ స్పీకరుగా పనిచేసిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి, జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన కేతిరెడ్డి హన్మంత్ రెడ్డి, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలేటి అన్నపూర్ణమ్మ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో గ్రానైట్ గనులున్నాయి. పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు నిర్మిస్తున్న నూతన రైల్వేమార్గం మండలం గుండా వెళ్ళుతుంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా నిజామాబాదు జిల్లాలో తూర్పువైపున జగిత్యాల జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఎర్గట్ల మండలం, దక్షిణాన మరియు నైరుతిన భీంగల్ మండలం, పశ్చిమాన మోర్తాడ్ మండలం, తూర్పున జగిత్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42525. ఇందులో పురుషులు 20778, మహిళలు 21747. రాజకీయాలు: ఈ మండలము బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు. 2014లో ఎంపీపీగా మలావత్ కౌసల్య ఎన్నికయ్యారు.
కమ్మర్‌పల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Basheerabad, Belur, Choutupalle, Dammannapet, Dammanpet(Ameernagar), Gudilingapur, Guntepalle ,Hasakothur, Inayat Nagar, Kammar Palle, Konapur, Konasamandar, Lakshmapur, Nagapur, Narsapur, Reachpalle, Uploor
ప్రముఖ గ్రామాలు
చౌటపల్లి (Chowtapalli): చౌటపల్లి నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం రాజకీయ ఉద్ధండులకు ప్రసిద్ధి. ఈ గ్రామానికి చెందిన కే.ఆర్.సురేష్ రెడ్డి కమ్మర్‌పల్లి మండల అధ్యక్షునిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ స్పీకరుగా పనిచేశారు.సురేష్ రెడ్డి తాత కేతిరెడ్డి హన్మంతరెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. ఈ గ్రామానికే చెందిన ఏలేటి అన్నపూర్ణమ్మ 2009లో సురేష్ రెడ్డిపై విజయం సాధించింది.
హాసాకొత్తూరు (Hasakothur):
హాసాకొత్తూరు నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. సినీపాటల రచయిత ప్రవీణ్ లక్ష్మా ఈ గ్రామానికి చెందినవారు. కమ్మర్‌పల్లి (Kammarpally): కమ్మర్‌పల్లి నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండలకేంద్రము. ఇది మేజర్ గ్రామపంచాయతి. కమ్మర్‌పల్లి రైల్వేస్టేషన్ పెద్దపల్లి-నిజామాబాదు సెక్షన్‌లో ఉంది నాగాపూర్ (Nagapur): నాగాపూర్ నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. గ్రామ జనాభా 1260, కుటుంబాలు 250. ఇది జిల్లాలో ఎండుమిర్చి ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kammarpali Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి