లోక్‌నాయక్‌గా ప్రసిద్ధి చెందిన జయప్రకాశ్ నారాయణ అక్టోబరు 11, 1902న ఉత్తరప్రదేశ్‌లోని సీతాబ్దియారాలో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధుడు మరియు రాజకీయ నాయకుడిగా పేరుపొందిన ఈయన 1970 వ దశకంలో ప్రధాని ఇందిరాగాంధీకి విధానాలకు వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చి ప్రసిద్ధిచెందారు. 1977 ఎన్నికలలో కాంగ్రెస్‌ను గద్దెదింపి జనతాపార్టీ అధికారంలోకి రావడానికి చేసిన కృషి కూడా అమోఘం. సంక్షిప్తంగా జె.పి.గా ప్రసిద్ధి చెందిన ఈయన 76 సం.ల వయస్సులో అక్టోబరు 8, 1979న పాట్నాలో జయప్రకాష్ మరణించారు ఈయన జయంతిని ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకుంటారు. 1998లో భారతరత్న పురస్కారం (మరణానంతరం) ప్రకటించబడింది.
బాల్యం, విద్యాభ్యాసం: జయప్రకాశ్ నారాయణ ఉత్తరప్రదేశ్‌లోని సీతాబ్దియారా గ్రామంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పాట్నాలో అభ్యసించి ఆ తర్వాత అమెరికాలో 8 సం.లు విద్యనభ్యసించి 1929లో భారతదేశం తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేసి అదేసమయంలో యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి కూడా లోనయ్యారు. 1920లో స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూర్బా గాంధీ అనుచరురాలైన ప్రభావతీ దేవిని వివాహమాడారు. స్వాతంత్ర్య సమరం: అమెరికానుండి వచ్చిన వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి మహాత్మాగాంధీకి సన్నిహితుడైనారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. విడుదల అనంతరం కాంగ్రెసు సోషలిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెస్ట్ కాగా రాం మనోహర్ లోహియా, బాసవన్ సింగ్ వంటివారితో కలసి ఈయన ఉద్యమాన్ని ముందుకు నడిపారు. స్వాతంత్ర్యానంతరం జె.పి. ఆచార్య నరేంద్ర దేవ్ మొదలైన వారితో కలసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోషలిస్టు పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం ఈ సోషలిస్టు పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మారి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించింది. సర్వోదయ: 1954లో జె.పి. రాజకీయాలనుండి విరమించుకుని తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది అయిన ఆచార్య వినోబాభావే యొక్క సర్వోదయ ఉద్యమానికి మరియు దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. తన భూమినంతా పేద ప్రజలకు ఇచ్చివేసి హజారిబాగ్‌లో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పారు. జె.పి. త్వరితగతిన భారతదేశంలో మహాత్మాగాంధీ భావాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడలలో నడుస్తున్న సర్వోదయ ఉద్యమకారులలో కెల్లా ప్రముఖునిగా రూపొందారు. సంపూర్ణ క్రాంతి: 1960 వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి బీహారు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించారు. 1974లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆ తర్వాత బీహార్ ఉద్యమంగా ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవా నికి జె.పి. పిలుపునిచ్చారు. అత్యవసర పరిథితి (ఎమర్జెన్సీ): ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల క్రింద నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని అలహాబాదు హైకోర్టు తప్పుపట్టగా వెంటనే జె.పి. ఇందిర రాజీనామాకు డిమాండ్ చేసి మిలిటరీకి మరియు పోలీసు యంత్రాంగానికి చట్టవిరుద్దమైన, అనైతికమైన ఆజ్ఞలను పాటించనవసరంలేదని సూచించారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే ఇందిరాగాంధీ జూన్ 25,1975 అర్థరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెనీ) ని విధించింది. జె.పి.ని మరియు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆఖరికి కాంగ్రెసు పార్టీ లోనే యంగ్ టర్క్‌లు గా పిలువబడుతున్న అసమ్మతి నేతలు కూడా అరెస్టు చేయబడ్డారు. జె.పి. ఛండీగర్‌లో డిటెన్యూగా ఉంచబడ్డాడు. ఆఖరికి జె.పి. ఆరోగ్యం క్షీణించడంతో నవంబరు 12 న విడుదల చేయబడ్డారు. చివరికి ఇందిరా గాంధీ జనవరి 18, 1977న ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించడంతో ఆమెను ఎదుర్కోవటానికి కాంగ్రెసుకు వ్యతిరేకంగా జె.పి.మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకున్నది. ఆ ఎన్నికలలో జనతాపార్టీ కాంగ్రెస్‌ను ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన మొట్ట మొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించింది. గుర్తింపులు:
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
|
19, జులై 2019, శుక్రవారం
జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి