27, మార్చి 2015, శుక్రవారం

పరిగి మండలము (Pargi Mandal)

జిల్లావికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్వికారాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంపరిగి అ/ని
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ లో/ని
జనాభా55571 (2001)
62839 (2011)
పరిగి వికారాబాదు జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళుతుంది. వికారాబాదు నుంచి కృష్ణా వరకు ప్రతిపాదనలో ఉన్న రైల్వేలైన్ కూడా మండలం నుంచి వెళుతుంది. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 37 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో లక్నాపూర్ ప్రాజెక్టు ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో చేర్చబడింది.

భౌగోళికం, రాజకీయాలు:
ఈ మండలానికి ఉత్తరాన ధరూర్, వికారాబాదు, పూడూరు మండలాలు, దక్షిణాన దోమ, కుల్కచర్ల మండలాలు, పశ్చిమాన యాలాల మండలం, తూర్పున మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55571. ఇందులో పురుషులు 27831, మహిళలు 27740. 1991 జనాభాతో పోలిస్తే దశాబ్ద కాలంలో 20.36% వృద్ధి సాధించింది. 2001 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో ఇది 21వ స్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62839. ఇందులో పురుషులు 31420, మహిళలు 31419. అక్షరాస్యుల సంఖ్య 34103.

రాజకీయాలు:
ఈ మండలము పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009కు ముందు హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన కరణం అరవింద్ రావు ఎన్నికయ్యారు.
 
ప్రముఖ పట్టణాలు/గ్రామాలు:
 
పరిగి (Parigi):
పరిగి వికారాబాదు జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘం మరియు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉంది. హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు రహదారిపై ఉన్న మూడక్షరాల పేరు కల ఈ పట్టణంలో మూడు రోడ్ల కూడళ్ళు అధికంగా ఉండుట విశేషం.

అక్టోబరు 11, 2016కు ముందు
రంగారెడ్డి జిల్లాలో పరిగి మండల స్థానం


హోం,
విభాగాలు:
వికారాబాదు జిల్లా మండలాలు, పరిగి మండలము, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక