28, మార్చి 2015, శనివారం

పట్టిసీమ ఎత్తిపోతల (Pattiseema Lift Irrigation)

పట్టిసీమ ఎత్తిపోతల
ప్రాంతంపట్టిసీమ (ప.గో.జిల్లా)
శంకుస్థాపన
గోదావరి జలాలను కృష్ణానదికి కలపడం ఈ ఎత్తిపోతల ఉద్దేశ్యం. పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ పంచాయతి పరిధిలోని బంగారంపేట వద్ద పంప్‌హౌస్ నిర్మించి గోదావరి జలాలను కుడి ప్రధాన కాలువకు మళ్ళిస్తారు. అక్కడి నుంచి కృష్ణానదికి నీటిని తీసుకెళ్తారు. దీనిద్వారా 80 టీఎంసీల వరద నీటిని ఆదా చేయడమే కాకుండా కాలువల ద్వారా కరువు ప్రాంతాలకు మళ్ళించడం ఈ పథకం ఉద్దేశ్యం.

కృష్ణానదికి వరదలు నిదానంగా వస్తాయి ఒక్కోసారి సెప్టెంబరు వరకు కూడా కృష్ణాలో కావలసింత నీరుండదు. అంతకు ముందు గోదావరిలో వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. దీని నిర్మాణంతో వరదనీరు కృష్ణా పరీవాహప్రాంతంలో ఉపయోగించవచ్చు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లు మించి ఉన్నప్పుడే నీరు ఎత్తిపోతేలా పథకం రూపొందించారు. ఈ ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ 1300 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చింది. మార్చి 29, 2015న ఈ ఎత్తిపోతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జలవనరులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక