29, మార్చి 2015, ఆదివారం

సంగం మండలం (Sangam Mandal)

సంగం మండలం
జిల్లానెల్లూరు జిల్లా,
వైశాల్యం218 చకిమీ
అసెంబ్లీ నియో.ఆత్మకూరు అ/ని
లోకసభ నియో.నెల్లూరు లో/ని
సంగం మండలం నెల్లూరు జిల్లాకు చెందిన మండలము. మండల వైశాల్యం 218 చకిమీ. మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలానికి దక్షిణాన సరిహద్దుగా పెన్నానది ప్రవహిస్తోంది. సంగం, దువ్వూరు, మర్రిపాడు, అన్నారెడ్డిపాలెం మండలంలోని పెద్ద గ్రామాలు. మండల కేంద్రంలో ప్రముఖమైన సంగమేశ్వరాలయం ఉంది. ఆత్మకూరు నుంచి కోవూరు వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. పర్వతారోహకుడు మల్లి మస్తాబ్ బాబు ఈ మండలమునకు చెందినవాడు.

మండల సరిహద్దులు:
సంగం మండలమునకు తూర్పున బుచ్చిరెడ్డిపాలెం, దగదర్తి మండలాలు, పడమరన ఆత్మకూరు, అనుమసముద్రంపేట మండలాలు, ఉత్తరాన అనుమసముద్రం పేట మండలం, దక్షిణాన పొదలకూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 32621. ఇందులో పురుషులు 16652, మహిళలు 15969. స్త్రీపురుష నిష్పత్తి (1033/వెయ్యి పురుషులకు)లో ఈ మండలం జిల్లాలో రెండవ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలం ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.


వ్యవసాయం, పంటలు:
మండలంలో పండించే ప్రధానపంట వరి. పత్తి, వేరుశనగ కూడా పండిస్తారు.


సంగమేశ్వరాలయం
రవాణా సౌకర్యాలు:
మండలం గుండా రైలుమార్గం కాని, జాతీయ రహదారులు కాని లేవు. మండలానికి తూర్పున ఉన్న కావలి, కోవూరు మండలాల గుండా జాతీయ రహదారి మరియు రైలుమార్గం వెళ్ళుచున్నది. సంగం మండలం మీదుగా ఆత్మకూరు నుంచి 5వ నెంబరు జాతీయ రహదారిని చేరే రోడ్డుమార్గం ఉంది.

మండలంలోని గ్రామాలు:
అన్నారెడ్డిపాలెం · కలిగిరి కొండూరు · కొరిమెర్ల కండ్రిక · కొరిమెర్ల · కొలగట్ల · చెన్నవరప్పాడు · జంగాల కండ్రిక · తరుణవాయి · తలుపూరుపాడు · దువ్వూరు · నీలయ్యపాలెం · పడమటిపాలెం · పెరమన · మక్తాపురం · మర్రిపాడు · వంగల్లు · సంగం · సిద్దిపురము

విభాగాలు: నెల్లూరు జిల్లా మండలాలు, సంగం మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక