23, ఏప్రిల్ 2015, గురువారం

భువనగిరి మండలం (Bhuvanagiri Mandal)

జిల్లానల్గొండ జిల్లా
వైశాల్యం190 చకిమీ
జనాభా1,29,82 (2011)
అసెంబ్లీ నియో.భువనగిరి అ/ని,
లోకసభ నియో.భువనగిరి లో/ని,
భువనగిరి యాదాద్రి భునవగిరి జిల్లాకు చెందిన మండలము. మండలకేంద్రంలో పురాతనమైన కోట ఉంది. మండలంలో 29 రెవెన్యూ గ్రామాలు, 35 గ్రామపంచాయతీలు, ఒక పురపాలక సంఘం కలవు. ప్రముఖ రాజకీయ నాయకుడు రావి నారాయణరెడ్డి, ఉమడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండల వైశాల్యం 29589 హెక్టార్లు (190 చకిమీ).  మండలము 17° 30' 10" - 17° 31'43" ఉత్తర అక్షాంశ రేఖ, 78° 53'00" - 78° 54'10" తూర్పు రేఖాంశం పై ఉన్నది. మండల పరిధిలో పండించే ముఖ్య పంట వరి.  మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. హైదరాబాదు - వరంగల్ ప్రధాన రహదారి, సికింద్రాబాదు - కాజీపేట రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. బీబీనగర్ - నడికుడి రైలు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది.

భౌగోళికం, సరిహద్దులు:
భువనగిరి మండలం భౌగోళికంగా జిల్లాలో మధ్యలో ఉన్నది. మండలము 17° 30' 10" - 17° 31'43" అక్షాంశ రేఖ, 78° 53'00" - 78° 54'10" రేఖాంశం పై ఉన్నది. మండల వైశాల్యం 29589 హెక్టార్లు (190 చకిమీ). భువనగిరి మండలానికి ఉత్తరాన యాదగిరిగుట్ట మండలం, తూర్పున ఆత్మకురు (ఎం) మండలం, ఆగ్నేయాన వలిగొండ మండలం, దక్షిణాన వలిగొండ, పోచంపల్లి మండలాలు, పశ్చిమాన బీబీనగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 99715. ఇందులో పురుషులు 50935, మహిళలు 48780. గృహాల సంఖ్య 20320. జనసాంద్రత 525/చకిమీ. మండల అక్షరాస్యత శాతం 59.09%. స్త్రీ పురుష నిషత్తి 955 (ప్రతి 1000కి). ఎస్సీల సంఖ్య 15008, ఎస్టీల సంఖ్య 3088. మండలంలో పట్టణ జనాభా 50407 (50.6%), గ్రామీణ జనాభా 49308 (49.4%).
2011 నాటికి జనాభా 3267 పెరిగి 102982 కు పెరిగింది. ఇందులో పురుషులు 52405, మహిళలు 50577. పట్టణ జనాభా 53434, గ్రామీణ జనాభా 49548. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 5వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు - వరంగల్ ప్రధాన రహదారి, సికింద్రాబాదు - కాజీపేట రైలు మార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. బీబీనగర్ - నడికుడి రైలు మార్గం ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది. భువనగిరి, రాయగిరి, నాగిరెడ్డిపల్లిలలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

భువనగిరి కోట
వ్యవసాయం, నీటిపారుదల:
మండలంలో పండించే ప్రధాన పంట వరి. ఖరీఫ్, రబీలలో కలిసి సుమారు 4500 హెక్టార్లలో సాగుచేస్తారు. కందులు, క్యాస్టర్, పండ్లు, కూరగాయలు, కూడా మండలంలో పండిస్తారు. మండలంలో నీటిపారుదలకు ఎలాంటి కాలువలు లేవు. బోర్ వెల్స్ ద్వారా అధికంగా సాగుచేస్తారు. చెరువుల కింద కొంత భూమి సాగు అవుతుంది.మండల సాధారణ వర్షపాతం 818 సెం.మీ. మండలంలో 74 హెక్టార్ల అటవీ ప్రాతం ఉంది (0.25%).

రాజకీయాలు:
ఈ మండలము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ప్రముఖ కమ్యూనిస్టు నయకుడు రావి నారాయణరెడ్డి, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.

పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థికం:
మండల కేంద్రంలో సూర్యవంశీ శైనింగ్ మిల్స్ కర్మాగారం, రాయగిరిలో ఫార్చ్యూన్ బయోటెక్ లిమెటెడ్ కర్మాగారాలు కలవు. మండలంలో మొత్తం 7 బ్యాంకులున్నాయి. జాతీయ బ్యాంకుల 3 శాఖలు, గ్రామీణ బ్యాంకుల 3 శాఖలు మరియు ఒక సహకార బ్యాంకు శాఖ ఉంది. మండలంలో ఎలాంటి ముఖ్య ఖనిజాలు లేవు. భవన నిర్మాణంలో ఉపయోగించే మెటల్ రాయి మాత్రం లభిస్తుంది.

భువనగిరి బస్టాండ్
విద్యాసౌకర్యాలు:
మండలంలో 2008 సెప్టెంబరు గణాంకాల ప్రకారం 78 ప్రాథమిక పాఠశాలలు (11 ప్రభుత్వ, 48 మండల పరిషత్తు, 15 ప్రైవేటు), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (4 ప్రభుత్వ, 5 మండల పరిషత్తు, 3 ప్రైవేటు), 38 ఉన్నత పాఠశాలలు (7 ప్రభుత్వ, 12 జడ్పీ, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 17 ప్రైవేటు అన్-ఎయిడెడ్) పాఠశాలలు కలవు. 9 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేటు, 1 రెసిడెంషియల్), 5 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించి 3 కళాశాలలు (ఇంజనీరింగ్, ఎంసీఏ, బీఎడ్) ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు అన్ని 29 గ్రామాలలో ఉండగా. ప్రాథమికోన్నత పాఠశాలలు 16 గ్రామాలలో, ఉన్నత పాఠశాలలు 12 గ్రామాలలో ఉన్నాయి.
ఎస్సీ (బాలుర) హాస్టళ్ళు 3, ఎస్సీ (బాలికల) హాస్టల్ 1, రెసిడెంషియల్ (బాలుర) 1, ఎస్టీ (బాలుర) హాస్టళ్ళు 2, ఆశ్రమ పాఠశాల (బాలికల) 1, బీసి (బాలుర) హాస్టళ్ళు 2, బీసి (బాలికల) హాస్టల్ 1 కలవు.

రావి నారాయణరెడ్డి
ఉద్యోగ సమాచారం:
2006 ఉద్యోగ గణాంకాల ప్రకారం మండలంలో 1293 ఉద్యోగులున్నారు. అధికంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 931 మంది ఉన్నారు. మొత్తం ఉద్యోగులలో గెజిటెడ్ 81, నాన్-గెజిటెడ్ 670, 4వ తరగరి సిబ్బంది 307, ఇతరులు 235 ఉన్నారు.

మండలంలోని గ్రామాలు:
అనంతారం · అనాజిపూర్ · కూనూరు · కేసారం · గౌసునగర్ · చందుపట్ల · చీమలకొండూరు · తాజ్‌పూర్‌ · తిమ్మాపూర్ · తుక్కాపూర్ · నందనం · నాగిరెడ్డిపల్లి · పగిడిపల్లి · పెంచికలపహాడ్ · బండసోమారం · బస్వాపూర్ · బొమ్మాయిపల్లి · బొల్లేపల్లి · భువనగిరి · ముత్యాలపల్లి · యర్రంబల్లె · రామచంద్రాపూర్ · రాయగిరి · వడపర్తి · వీరవల్లి · సూరేపల్లి · హన్మాపూర్

ఇవి కూడా చూడండి:


విభాగాలు: యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు, భువనగిరి మండలము, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక