6, జూన్ 2015, శనివారం

ఆర్తీ అగర్వాల్ (Aarthi Aggarwal)

జననంమార్చి 5, 1984
జన్మస్థానంన్యూజెర్సీ
రంగంసినిమా నటి
మరణంజూన్ 6, 2015
తెలుగు సినీనటిగా పేరుపొందిన ఆర్తీ అగర్వాల్ మార్చి 5, 1984న అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో జన్మించింది. ఈమె 16 ఏళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది. 2007లో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్జ్వల్ కుమార్ ను వివాహమాడి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. జూన్ 6, 2015న ఆర్తి అగర్వాల్ అమెరికాలో మరణించింది. ఆర్తీ చెల్లెలు అదితి కూడా తెలుగు సినిమాలలో నటిగా గుర్తింపు పొందింది.

సినీ ప్రస్థానం:
ఈమె 16 ఏళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది. డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మరియు నాగార్జున ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. చిరంజీవి తో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. "జంక్షన్‌లో జయమాలిని" చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి లైపోసక్షన్ సర్జరీ చికిత్స చేయించుకోవడంతో ఆపరేషన్ వికటించి మరణించింది.


విభాగాలు: తెలుగు సినిమా నటీమణులు, 1984లో జన్మించినవారు, 2015లో మరణించినవారు.


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక