16, జూన్ 2015, మంగళవారం

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjala Gopala Krishna Reddy)

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
జననంఏప్రిల్ 15, 1949
స్వస్థలంఊరందూరు  (చిత్తూరు జిల్లా)
పదవులు4 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఏప్రిల్ 15, 1949న శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో జన్మించిన గోపాలకృష్ణారెడ్డి  శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి 1968లో బీఎస్సీ పట్టాను, 1972లో న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. శ్రీకాళహస్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రిగా ఉన్నారు. ఈయన తండ్రి బొజ్జల గంగసుబ్బారెడ్డి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
న్యాయశాస్త్ర విద్య పూర్తిచేసిన పిమ్మట క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన బొజ్జల 1989లో శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో గెలుపొంది నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిథి ఎస్సీవీ నాయుడు చేతిలో ఓటమి చెందారు. మళ్ళీ 2009 ఎన్నికల్లో అదే నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో 4వ సారి విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం పొందారు.


విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, శ్రీకాళహస్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, 1949లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక