దుగ్గిరాల గుంటూరు జిల్లాకు చెందిన మండలము. పసుపు వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రముఖ రంగస్థల నటులు తండ్రీ-కొడుకులైన కొంగర సీతారామయ్య, కొంగర జగయ్యలు, రాజకీయ నాయకుడు గొల్లపూడి వేదాంతరావు ఈ మండలమునకు చెందిన వారు. దుగ్గిరాల 16.32° ఉత్తర అక్షాంశం 80.62°తూర్పు రేఖాంశంపై ఉన్న ఈ మండలం "ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం"లో భాగంగా చేరింది. దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62629.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలము గుంటూరు జిల్లాలో ఈశాన్య సరిహద్దులో కృష్ణానది తీరాన ఉంది. మండలానికి ఆగ్నేయంలో కొల్లిపర మండలం, దక్షిణాన మరియు నైరుతిన తెనాలి మండలం, పశ్చిమాన పెదకాకాని మండలం, ఉత్తరాన మంగళగిరి మండలం, ఈశాన్యాన కృష్ణానది, దానికి ఆవల కృష్ణా జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల మండల జనాభా 60420. ఇందులో పురుషులు 30346, మహిళలు 30074. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62629. ఇందులో పురుషులు 31290, మహిళలు 31339. రాజకీయాలు: దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు లోకసభ నియోజకవర్గంలో భాగము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన్ గొల్లపూడి వేదాంతరావు ఈ మండలమునకు చెందినవారు. రవాణా సౌకర్యాలు: విజయవాడ నుంచి తెనాలి వెళ్ళు రహదారి మరియు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. మండలంలోని గ్రామాలు: ఈమని, కంఠంరాజు కొండూరు, గొడవర్రు, చింతలపూడి, చినపాలెం, చిలువూరు, తుమ్మపూడి, దుగ్గిరాల, దేవరపల్లె అగ్రహారం, పెదకొండూరు, పెదపాలెం, పెనుమూడి, పెరకలపూడి, మంచికలపూడి, మోరంపూడి, రేవేంద్రపాడు, వీర్లపాలెం, శృంగారపురం, .
= = = = =
|
3, జూన్ 2015, బుధవారం
దుగ్గిరాల మండలం (Duggirala Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి