ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన రాధాబాయి ఆనందరావు ఫిబ్రవరి 2, 1930న ఖమ్మం జిల్లా వెంకటాపురంలో జన్మించారు. కోయ గిరిజన తెగకు చెందిన ఈమె మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కొత్తగూడెం పంచాయతి సమితి సభ్యురాలిగా, వరసగా 4 సార్లు భద్రాచలం లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మండలి సభ్యురాలిగా కూడా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం: మొదట వెంకటాపురంలోనూ, దుమ్ముగూడెంలోనూ ఉపాధ్యాయిరాలిగా పనిచేసిన రాధాబాయి 1957లో కొత్తగూడెం పంచాయతి సమితి సభ్యురాలిగా గెలుపొందినది. 1967లో భద్రాచలం లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తొలిసారి లోకసభలో ప్రవేశించింది. ఆ తర్వాత 1977, 1980, 1984లలో కూడా అదే స్థానం నుంచి పోటీచేసి వరసగా 4 సార్లు లోకసభకు ఎన్నికైనారు. 1989లో మాత్రం మిత్రపక్షాల అభ్యర్థిగా కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీచేసిన సోడె రామయ్య చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ టికెట్ లభించలేదు. తర్వాత రాజకీయాలకు దూరమైనారు.
= = = = =
|
19, జులై 2015, ఆదివారం
రాధాబాయి ఆనందరావు (Radhabai Ananda Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి