19, జులై 2015, ఆదివారం

యెండెల లక్ష్మీనారాయణ (Yendela Laxminarayana)

జననంమార్చి 1, 1963
జిల్లానిజామాబాదు జిల్లా
రంగంరాజకీయాలు
పదవులు2 సార్లు ఎమ్మెల్యే,
యెండెల లక్ష్మీనారాయణ నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన మార్చి 1, 1963న నిజామాబాదులో జన్మించారు. డిగ్రీ చదివే రోజుల్లో కళాశాల ఎన్నికలలో విజయం సాధించారు. ప్రారంభంలో భారతీయ జనతా యువమోర్చాలో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించబడ్డారు. నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన తండ్రి 3 సార్లు పురపాలక సంఘం కౌన్సిలర్‌గా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
2009లో నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి అప్పటి పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పై సంచలన విజయం సాధించారు. తెలంగాణకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ అదేస్థానం నుంచి భాజపా తరఫున మరోసారి ధర్మపురి శ్రీనివాస్ పై గెలుపొందినారు. భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2014లో నిజామాబాదు లోకసభ నియోజకర్గం నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు.


విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, తెలంగాణ భాజపా ప్రముఖులు, నిజామాబాదు, నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు, 1963లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక