20, జులై 2015, సోమవారం

సోడె రామయ్య (Sode Ramaiah)

జననంజూలై 13, 1943
రంగంరాజకీయాలు
పదవులు3 సార్లు ఎంపి,
ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన సోడె రామయ్య జూలై 13, 1943 న కూనవరం మండలం కొండ్రాజుపేటలో జన్మించారు. కోయ గిరిజన తెగకు చెందిన ఈయన మెట్రిక్ వరకు అభ్యసించి కమ్యూనిస్టు పార్టీ తరఫున రాజకీయాలలో ప్రవేశించారు. సుధీర్ఘకాలం పాటు గ్రామ సర్పంచిగా పనిచేసి పంచాయతి సమితి అధ్యక్షులుగా, లోకసభ సభ్యుడిగా విజయం సాధించారు.

రాజకీయ ప్రస్థానం:
కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన సోడె రామయ్య 1962లో స్వగ్రామం కొండ్రాజుపేట సర్పంచిగా తొలిసారి ఎన్నికై ఆ తర్వాత వరస విజయాలు సాధిస్తూ మొత్తం 19 సంవత్సరాలు పనిచేశారు. 1981లో కూనవరం పంచాయతి సమితి అధ్యక్షులుగా ఎన్నికైనారు. సర్పంచిగా ఉన్నప్పుడే 1967లో భద్రాచలం లోకసభ స్థానానికి కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీచేసి రాధాబాయి చేతిలో ఓడిపోయారు. 1977లో కూడా అదేస్థానం నుంచి పోటీచేసి మళ్ళీ రాధాబాయి చేతిలో పరాజయం పొందారు. 1984లో మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీచేసిన సోడె రామయ్య తొలిసారి లోకసభకు ఎన్నికైనారు. 1989, 1991లలో మళ్ళీ లోకసభకు పోటీచేసి కర్రెద్దుల కమలకుమారి చేతిలో ఓడిపోగా 1996లో కమలకుమారిపై గెలుపొంది రెండవసారి లోకసభలో ప్రవేశించారు. 1998లో వరసగా రెండోసారి, మొత్తంపై మూడవసారి భద్రాచలం ఎంపి అయ్యారు.

విభాగాలు: ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులు, కూనవరం మండలం, 1943లో జన్మించినవారు, 8వ లోకసభ సభ్యులు, 11వ లోకసభ సభ్యులు, 12వ లోకసభ సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక