3, మే 2016, మంగళవారం

ఆందోల్ మండలం (Andole Mandal)

ఆందోల్ మండలం
జిల్లామెదక్ జిల్లా
జనాభా63727 (2011)
అసెంబ్లీ నియో.ఆందోల్ అ/ని,


ఆందోల్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. నిజాం పోరాటయోధుడు మగ్దూం మెహియుద్దీన్, మెదక్ ఎంపీగా పనిచేసిన పట్లోళ్ళ మాణిక్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు, ఒక పురపాలక సంఘం కలవు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం మెదక్ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన టేక్మల్ మండలం, తూర్పున కౌడిపల్లి మండలం, దక్షిణాన పులికల్ మండలం, వాయువ్యాన అల్లాదుర్గ్ మండలం, ఆగ్నేయాన హత్నూర్ మండలం, పశ్చిమాన కొంతవరకు మనూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63727. ఇందులో పురుషులు 31177, మహిళలు 32550. అక్షరాస్యుల సంఖ్య 34231. పట్టణ జనాభా 18588, గ్రామీణ జనాభా 45139.

రాజకీయాలు:
ఈ మండలం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.

ఆందోల్ మండలంలోని గ్రామాలు :
అక్సాన్‌పల్లి · అనంతసాగర్ · అల్మయిపేట · ఆందోల్ · ఎర్రారం · కన్సాన్‌పల్లి · కీచనపల్లి · కొండారెడ్డిపల్లి · కోడెకల్ · చింతకుంట · జోగిపేట్ · తడమానూర్ · తేలెల్మ · దాకూర్ · దానంపల్లి · నడ్లాపూర్ · నీరిడిగుంట · పోతారెడ్డిపల్లి · పోసానిపేట్ · బ్రాహ్మణ్‌పల్లి · మన్సాన్‌పల్లి · మన్సాన్‌పల్లి · రాంసాన్‌పల్లి · రొళ్ళపహాడ్ · సంగుపేట్ · సాయిబాన్‌పేట్ · సేరిమల్లారెడ్డిపల్లి


విభాగాలు: మెదక్ జిల్లా మండలాలు, ఆందోల్ మండలం, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక