రాజస్థాన్ భారతదేశంలోనే భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం. 3,42,239 చకిమీ విస్తీర్ణంతో (దేశంలో 10.4%) ఉన్న రాజస్థాన్ జనాభాలో దేశంలో 7వ స్థానంలో ఉంది. దేశ వాయువ్యం వైపున పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద ఎడారి అయిన థార్ ఎడారిని కూడా కలిగియుంది. 1949లో ఏర్పడిన ఈ రాష్ట్ర రాజధాని జైపూర్. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దును కూడా ఈ రాష్ట్రం కలిగియుంది. జైపూర్‌తో పాటు జోధ్‌పూర్, కోట, బికానేర్, అజ్మీర్, ఉదయ్‌పూర్ రాజస్థాన్‌లోని పెద్ద నగరాలు. సింధూనాగరికతకు చెందిన కాలిబంగన్, బాలాథల్ లాంటి ప్రాచీన నగరాలు ఈ రాష్ట్రంలో బయటపడ్డాయి. ఆరావళి పర్వతపంక్తిలోని దిల్వారా జైన ఆలయం, హవామహల్, భరత్‌పూర్ జాతీయ పార్క్, మౌంట్ అబూ దేవాలయం, రణథంబొర్ జాతీయ పార్క్, సరిస్కా టైగర్ రిజర్వ్ లాంటి పర్యాటక ప్రాంతాలు ఈ రాష్ట్రపు ప్రత్యేకతలు.
చరిత్ర: సింధూనాగరికత కాలం నాటి పట్టణాలు రాజస్థాన్6లో బయటపడ్డాయి. త్రవ్వకాలలో బయటపడిన కాలిబంగన్ బాలాథల్ పట్టణాలకు క్రీ.పూ. 3000 - 1500 నాటి చరిత్ర ఉంది. బుండి, భిల్వారా జిల్లాలలో రాతి శిలాయుగం కాలం నాటి అనగా 5,000 నుంచి 200,000 సం.ల చరిత్ర ఉన్న పనిముట్లు లభించాయి. వేదకాలం నాటి మత్య రాజ్యం ఇప్పటి జైపూర్ ప్రాంతంలో వెలిసినట్లుగా చరిత్రకారులు నిరూపించారు. క్రీ.పూ.4వ శతాబ్ది నుంచి పశ్చిమ క్షాత్రపులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 6వ శతాబ్ది నుంచి రాజపుత్రుల పాలన మొదలైంది. మధ్యయుగంలో గుర్జారులు కూడా పాలించారు. క్రీ.శ. 8-11 శతాబ్దాల కాలంలో మహమ్మదీయులు ఈ ప్రాంతంపై దండెత్తారు. స్వాతంత్ర్యానికి పూర్వం రాజ్‌పుతానాతో పాటు పలు చిన్నచిన్న సంస్థానాలు ఇప్పటి రాజస్థాన్ ప్రాంతాన్ని పాలించాయి. 1949లో రాష్ట్రానికి ఇప్పటి భౌగోళికరూపం వచ్చింది. భౌగోళికం: ఆర్థికం: పరిపాలన: రవాణా: క్రీడలు: ఇవి కూడా చూడండి:
= = = = =
|
14, మార్చి 2019, గురువారం
రాజస్థాన్ (Rajasthan)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి