7, జూన్ 2016, మంగళవారం

సూర్యాపేట మండలం (Suryapet Mandal)

జిల్లాసూర్యాపేట జిల్లా
అసెంబ్లీ నియో.సూర్యాపేట అ/ని,
లోకసభ నియో.నల్గొండ లో/ని,
జనాభా140662 (2001),
155148 (2011),
ఈ మండలం సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము.. పూనా-విజయవాడ (9వ నెంబరు ) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 18 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము. చారిత్రకమైన గ్రామం పిల్లలమర్రి ఈ మండలంలోనే ఉంది. ప్రముఖ కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు, స్వాతంత్ర్యోద్యమ నేత ఉమ్మెత్తల కేశవరావు, ప్రముఖ కార్టూనిస్ట్ కంభాలపల్లి శేఖర్ ఈ మండలానికి చెందినవారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది.

సరిహద్దులు:
సూర్యాపేట మండలమునకు తూర్పున చివ్వెంల మండలం, దక్షిణాన పెన్‌పహాడ్ మండలం, పశ్చిమాన కేతేపల్లి మండలం, వాయువ్యాన కొద్దిగా నక్రేకల్, శాలిగౌరారం మండలాలు, ఉత్తరాన జాజిరెడ్డిగూడెం మండలం, ఈశాన్యాన ఆత్మకూరు (ఎస్) మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 140662, 2011 నాటికి జనాభా 14486 పెరిగి 155148 కు పెరిగింది.2011 లెక్కల ప్రకారం మండల జనాభా 155148. ఇందులో పురుషులు 77114, మహిళలు 78034. పట్టణ జనాభా 106524, గ్రామీణ జనాభా 48624. అక్షరాస్యత శాతం 76.56%.

రాజకీయాలు:
ఈ మండలము సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సూర్యాపేట లోకసభ నియోజకవర్గం కేంద్రంగా ఉండింది.

రవాణా సౌకర్యాలు:
9వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. సూర్యాపేట పట్టణం జాతీయ రహదారిపై ఉంది. రైలుసౌకర్యం మాత్రం మండలమునకు లేదు.


విభాగాలు: సూర్యాపేట జిల్లా మండలాలు, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =


Tags: Nalgonda District Mandals, Suryapet Mandal in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక