11, జూన్ 2015, గురువారం

నక్రేకల్ మండలం (Nakrekal Mandal)

జిల్లానల్గొండ జిల్లా
జనాభా60896 (2011)
అసెంబ్లీ నియో.నక్రేకల్ అ/ని,
లోకసభ నియో.భువనగిరి లో/ని,
పిన్ కోడ్508211
నక్రేకల్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (9వ నెంబరు) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామపంచాయతీలు కలవు. ఈ మండలము నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ప్రముఖ నవలా రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి, జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ అధిపతి కె.రవీందర్ రెడ్డి, నిజాం విమోచన పోరాటయోధులు కంచనపల్లి పెద్దవెంకట రామారావు మరియు రాంరెడ్డి  ఈ మండలమునకు చెందినవారు. రుద్రమదేవి మరణించిన చందుపట్ల గ్రామం ఈ మండలంలోనే ఉంది.

సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున కేతెపల్లి మండలం, ఉత్తరాన షాలిగౌరారం మండలం, దక్షిణా తిప్పర్తి మండలం, పశ్చిమాన కట్టంగూర్ మండలం, ఆగ్నేయంలో సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55030, 2011 నాటికి జనాభా 5866 పెరిగి 60896 కు పెరిగింది. 2001 మరియు జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో 15వ స్థానంలో ఉండగా 2011 నాటికి 13వ స్థానానికి చేరింది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60896. ఇందులో పురుషులు 30322, మహిళలు 30574. పట్టణ జనాభా 29247, గ్రామీణ జనాభా 31649. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జిల్లాలో 13వ స్థానంలో ఉంది.
రాజకీయాలు:
ఈ మండలము నక్రేకల్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. గతంలో కమ్యూనిస్టు పార్టీకి ఈ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. నర్రా రాఘవరెడ్డి ఇక్కడి నుంచి శాసనసభకు 6 సార్లు ఎన్నికయ్యారు.

చందుపట్ల శాసనం
కాలరేఖ:
  • 1289: యుద్ధం చేస్తూ కాకతీయ పాలకురాలు రుద్రమదేవి చందుపట్ల గ్రామంలో మరణించింది.
  • 2013, జూలై 14: నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కంటెపాక నర్సయ్య మరణించారు.
మండలంలోని గ్రామాలు:
  • అడవిబొల్లారం, ఒగోడు, కందిమళ్ళ వారి గూడెం, కడపర్తి, గొరెంకల్‌పల్లి, చందంపల్లి, చందుపట్ల, తాటికల్, తెట్టెకుంట, నకిరేకల్, నెల్లిబండ, నోముల, పాలెం, మంగలిపల్లి, మండలపూర్, మర్రూర్, వల్లభాపూర్ 
 
మండలంలోని ప్రముఖ గ్రామాలు / పట్టణాలు:
నక్రేకల్ (Nakrekal):
నక్రేకల్ నల్గొండ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా కూడా ఉంది. జాతీయ రహదారిపై ఉన్న ఈ పట్టణం హైదరాబాదు నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ విమోచన పోరాటయోధుడు కంచనపల్లి పెద్దవెంకట రామారావు ఈ పట్టణానికి చెందినవారు.
పాలెం (Palem):
పాలెం నల్గొండ జిల్లా నక్రేకల్ మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకుడు నోముల నర్సింహయ్య ఈ గ్రామానికి చెందినవారు. ఈయన 2 సార్లు నక్రేకల్ మండల అధ్యక్షులుగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 




విభాగాలు: నల్గొండ జిల్లా మండలాలు, నక్రేకల్ మండలము,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక