మంచిర్యాల జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న ఏర్పడిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 18 మండలాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాలోనివే. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి ఈ జిల్లాలోని పెద్ద పట్టణాలు. సికింద్రాబాదు-ఢిల్లీ రైలుమార్గం మరియు నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నవి. జైపూర్‌లో సింగరేణి విద్యుత్ కేంద్రం, మంచిర్యాలలో ఎంసిసి సిమెంట్ కర్మాగారం ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: మంచిర్యాల జిల్లా తెలంగాణలో ఉత్తరభాగంలో గోదావరి నదికి పైన ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన కొమురంభీం జిల్లా, దక్షిణాన జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, పశ్చిమాన నిర్మల్ జిల్లా, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాలు: మంచిర్యాల డివిజన్: చెన్నూరు, జైపూర్, భీమారం, కోటపల్లి, లక్సెట్టిపల్లి, మంచిర్యాల, నస్పూర్, హాజిపూర్, మందమర్రి, దండేపల్లి, జన్నారం. బెల్లంపల్లి డివిజన్: కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల్, తాండూర్, భీమిని, కన్నేపల్లి. రాజకీయాలు: ఈ జిల్లా 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మరియు ఖానాపూర్ నియోజకవర్గాలు పూర్తిగా లేదా పాక్షికంగా జిల్లా పరిధిలో ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: సికింద్రాబాదు నుంచి డిల్లీ వెళ్ళు ప్రధానరైలుమార్గం ఉత్తర-దక్షిణంగా జిల్లా గుండా వెళ్ళుచున్నది. మంచిర్యాల మరియు బెల్లంపల్లి జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయరహదారి తూర్పు-పడమరగా జిల్లా దక్షిణ భాగం గుండా వెళ్తుంది. ఇవి కూడా చూడండి:
= = = = =
ఆధారాలు:
|
20, అక్టోబర్ 2016, గురువారం
మంచిర్యాల జిల్లా (Manchiryal District)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి