చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. హైదరాబాదు-బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మండల కేంద్రంలో పురాతనమైన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. పూర్వ రంగారెడ్డి జిల్లాలో భౌగోళికంగా చేవెళ్ళ మండలం జిల్లా మధ్యలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ వైపున వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఇది అసెంబ్లీ మరియు లోకసభ నియోజకవర్గం కేంద్రము. ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు మరియు సమరయోధుడు మందుముల నరసింగరావు ఈ మండలంలోనే జన్మించారు. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత బిత్తిరిసత్తిగా ప్రసిద్ధి చెందిన రవి ఈ మండలమునకు చెందినవాడు.
సరిహద్దులు: చేవెళ్ళ మండలానికి తూర్పున మొయినాబాదు మండలం, ఉత్తరాన శంకర్‌పల్లి మండలం, దక్షిణాన షాబాద్ మండలం, పశ్చిమాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55784. ఇందులో పురుషులు 28380, మహిళలు 27404. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58269. ఇందులో పురుషులు 29568, మహిళలు 28701. అక్షరాస్యుల సంఖ్య 32858. రవాణా సౌకర్యాలు: హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు ప్రధాన రహదారి చేవెళ్ళ గుండా వెళ్ళుచున్నది. అలాగే 44వ నెంబరు జాతీయ రహదారి మరియు 65వ నెంబరు జాతీయ రహదారులను కలిపే షాద్‌నగర్-కంది మార్గం కూడా చేవెళ్ళ గుండా వెళ్ళుచున్నది. ఈ మండలానికి రైలు సదుపాయం లేదు. మండలానికి ఉత్తర సరిహద్దులో ఉన్న శంకర్‌పల్లి మండలం గుండా హైదరాబాదు-వాడి రైలుమార్గం ఉంది. మండలంలోని గ్రామాలు: Allawada, Aloor, Anantawaram, Bastepur, Chanvelli, Chevella, Damergidda, Dearlapalli, Devarampalle, Devuni Erravelly, Gollapalli, Gundal, Hasthepur, Ibrahimpalli, Kammeta, Kanduwada, Kesavaram, Khanapur, Kistapur, Kowkuntla, Kummera, Malkapur, Mirjaguda, Mudimyal, Naincheru, Nowlaipalli, Nyalata , Orella, Pamena, Ravulapalli (Khurd), Regadghanapur, Tallaram, Tangedapalli, Yenkepalli. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి