కందుకూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. అంతకుక్రితం సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్‌లో ఉండేది. మండలంలోని ముచ్చర్లలో ఔషధ నగరి (ఫార్మా సిటీ) ఏర్పాటు జరుగుతోంది.
సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా దాదాపు జిల్లా మధ్యలో ఉంది. తూర్పున యాచారం మండలం, దక్షిణాన కడ్తాల్ మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన మహేశ్వరం మండలం, ఉత్తరాన మరియు ఈశాన్యాన ఇబ్రహీంపట్నం మండలం సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 51018. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54556. ఇందులో పురుషులు 28023, మహిళలు 26533. అక్షరాస్యుల సంఖ్య 28419. మండలంలోని గ్రామాలు: Akberja, Allikhanpalle, Annojiguda, Bachupalle, Chippalpalle, Dasarlapalle, Debbadaguda, Dhannaram, Gafoornagar, Gudoor, Gummadavalle, Jaithwaram, (Khalsa), Jaithwaram (Maqta), Kandukur, Kothur, Kufarchandguda, Lemoor, Madhapur, Meerkhanpet, Mohammadnagar, Mucherla, Murlinagar, Nednur, Panjaguda, Peruguguda, Pulumamidi, Rachloor, Sarvaravulapalle, Thimmaipalle, Timmapur,
మండలంలోని ప్రముఖ గ్రామాలు
ముచ్చర్ల (Mucharla):ఈ గ్రామంలో ఔషద నగరి (ఫార్మాసిటి) నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిమ్మాపూర్ (Thimmapur): భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్వగ్రామం. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి