పెద్దవూర నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న మండలంలోని 5 గ్రామాలను కొత్తగా ఏర్పడిన తిరుమలగిరిసాగర్ మండలలో కలుపగా ప్రస్తుతం మండలంలోని 21 రెవెన్యూ గ్రామాలు మిగిలాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. తెలంగాణలోని ప్రముఖ జలవిద్యుత్ ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కృష్ణానదిపై ఈ మండలంలోనే ఉంది.
సరిహద్దులు: ఈ మండలం నల్గొండ జిల్లాలో దక్షిణంవైపున ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. మండలానికి తూర్పున తిరుమలగిరిసాగర్ మండలం, ఉత్తరాన మరియు ఈశాన్యాన హాలియా (అనుముల) మండలం, పశ్చిమాన పెద్దఆదిశర్ల పల్లి మండలం, వాయువ్యాన గుర్రంపోడు మండలం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 65231, 2011 నాటికి జనాభా 2692 పెరిగి 67923 కు పెరిగింది. ఇందులో పురుషులు 34309, మహిళలు 33614. పట్టణ జనాభా 15909, గ్రామీణ జనాభా 52014. మండలంలోని గ్రామాలు: Chelakurthi, Chinthapally, Garnekunta, Kothaluru, Lingampally, Nandikonda, Parvedula, Peddavoora, Pinnavoor, Polepally-M- Singaram, Pothunoor, Pulicherla, Sangaram, Sirasangandla, Sunkishala, Thammadavally, Theppalamadugu, Thungathurthy, Velmaguda, Vijayapuri North, Vutlapally ముఖ్యమైన గ్రామాలు: తెలంగాణలోనే ప్రముఖమైన జలవిద్యుత్ ప్రాజెక్టు ఈ గ్రామపరిధిలోనే కృష్ణానదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో నందికొండ ప్రాజెక్టుగా పిలువబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Tripuraram Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి