మట్టంపల్లి సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామపంచాయతీలు కలవు. మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, చర్చి, సాగర్ సిమెంట్ కర్మాగారం ఉన్నాయి. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రామిరెడ్డి ఈ మండలానికి చెందినవారు. 1968లో ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం భౌగోళికంగా జిల్లాలో దక్షిణాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉంది. దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఉత్తరాన హుజూర్‌నగర్ మండలం, తూర్పున మేళ్ళచెరువు మండలం మరియు చింతలపాలెం మండలం, పశ్చిమాన పాలకీడు మండలం, వాయువ్యాన గరిడేపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41857, 2011 నాటికి జనాభా 3104 పెరిగి 44961 కు చేరింది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44961. ఇందులో పురుషులు 22628, మహిళలు 22333. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. జడ్పీ చైర్మెన్‌గా, 3 సార్లు ఎంపీగా పనిచేసిన జి.ఎస్.రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. గుండ్లపల్లికి చెందిన తెలంగాణ రామిరెడ్డి (గుండా రామిరెడ్డి) 1968లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Alipuram, Chennaipalem, Choutapalli, Gundlapalli, Mattampalli, Mattapalli, Pedaveedu, Raghunathapalem, Vardapuram, Yatavakilla
ప్రముఖ గ్రామాలు
మట్టంపల్లి (Mattampally):మట్టంపల్లి సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. జడ్పీ చైర్మెన్‌గా, 3 సార్లు ఎంపీగా పనిచేసిన జి.ఎస్.రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు. మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, చర్చి ఉన్నాయి. గ్రామంలో సాగర్ సిమెంట్ కర్మాగారం ఉంది. కృష్ణానది తీరంలో ఉన్న ఈ గ్రామం పంచనారసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. గ్రామంలోని చర్చి తెలంగాణలోని ప్రముఖ చర్చిలలో ఒకటిగా పేరుపొందింది. గుండ్లపల్లి (Gundlapalli): గుండ్లపల్లి సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలమునకు చెందిన గ్రామము. తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రామిరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. 1968లో ఈయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mattampalli Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి