మేళ్ళచెరువు సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. స్వాతంత్ర్యోద్యమ నేత, 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ మండలమునకు చెందినవారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గోండ జిల్లాలో ఉండేది. అక్టోబరు 11, 2016న మండలంలోని 10 గ్రామాలను విడదీసి కొత్తగా చింతలపాలెం మండలాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కోదాడ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన చింతలపాలెం మండలం, నైరుతిన మరియు పశ్చిమాన మట్టంపల్లి మండలం, వాయువ్యాన హుజూర్‌నగర్ మండలం, తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ మండలానికి చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Kandibanda, Mellacheruvu, Revoor, Yepalamadhavaram
ప్రముఖ గ్రామాలు
మేళ్ళచెరువు (Mellacheruvu):మేళ్ళచెరువు సూర్యాపేట జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది చరిత్రాత్మకమైన గ్రామము. గ్రామంలో శంభులింగేశ్వరాలయం ఉంది. స్వాతంత్ర్యోద్యమ నేత మరియు 2 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అక్కిరాజు వాసుదేవరావు ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Akkineni Vasudev Rao, Mellacheruvu Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి