మునగాల సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. పూనా-విజయవాడ (65వ నెంబరు ) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు కలవు. నిజాం విమోచనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన కోదాటి నారాయణరావు ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యలో ఉంది. ఈ మండలానికి తూర్పున నడిగూడెం మండలం, దక్షిణాన చిల్కూరు మండలం, పశ్చిమాన పెన్‌పహాడ్ మండలం, ఉత్తరాన మోతె మండలం, వాయువ్యాన చివ్వెంల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43116, 2011 నాటికి జనాభా 546 పెరిగి 43662 కు చేరింది. ఇందులో పురుషులు 22233, మహిళలు 21429. రాజకీయాలు: ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akupamula, Barakathgudem, Ganapavaram, Kalakova, Kokkireni, Madhavaram, Munagala, Nelamarri, Repala, Syed Muzavarpeta, Tadvai,
ప్రముఖ గ్రామాలు
రేపాల (Repala):హైదరాబాదు విమోచనోద్యమంలో ఈ గ్రామం ప్రముఖ పాత్ర వహించింది. విమోచనకారులు ఏర్పాటు చేసిన 4 క్యాంపులలో ఇదొకటి. నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న కోదాటి నారాయణ రావు ఈ గ్రామంలోనే జన్మించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kodati Narayanarao, Munagala Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి