నడిగూడెం సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో తూర్పు వైపున ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉంది. మండలానికి ఉత్తరాన మోతె మండలం, పశ్చిమాన మరియు దక్షిణాన మునగాల మండలం, ఆగ్నేయాన అనంతగిరి మండలం, తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులు ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 39543, 2011 నాటికి జనాభా 213 తగ్గి 39330 కు చేరింది. ఇందులో పురుషులు 19562, మహిళలు 19768. రాజకీయాలు: ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ ప్రముఖులు భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లుస్వరాజ్యం ఈ మండలానికి చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Brindavanapuram, Chakirala, Eklaskhan Peta, Kagitha Ramachandrapuram, Karivirala, Nadigudem, Ramapuram, Rathnavaram, Siripuram, Tellebelly, Vallapuram
ప్రముఖ గ్రామాలు
రత్నవరం (Ratnavaram):రత్నవరం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన శ్రీకళారెడ్డి జూలై 2021లో ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పరిషత్తు జడ్పీ చైర్మెన్‌గా భాజపా తరఫున ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kodati Narayanarao, Munagala Mandal Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి, మల్లు స్వరాజ్యం గారు ఈ గ్రామానికి చెందిన వారు కాదు వారు తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని karivirala గ్రామానికి చెందిన వారు
రిప్లయితొలగించండి