చిల్కూరు సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజన్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగము. 1941లో మండలకేంద్రం చిల్కూరులో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రమహాసభలు జరిగాయి.
భౌగోళికం, సరిహద్దులు: మండలానికి తూర్పున కోదాడ మండలం, దక్షిణాన హుజూర్‌నగర్ మండలం, పశ్చిమాన గరిడేపల్లి మండలం, ఉత్తరాన మునగాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 37770, 2011 నాటికి జనాభా 1456 పెరిగి 39226 కు చేరింది. ఇందులో పురుషులు 19737, మహిళలు 19489. రాజకీయాలు: ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: బేతవోలు, చిల్కూరు, కొండాపురం, పాలె అన్నారం
ప్రముఖ గ్రామాలు
చిలుకూరు (Chilkur):1941లో చిలకూరులో 8వ ఆంధ్రమహాసభ జరిగింది. ఈ సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. నిజాం విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన కస్తూరి అప్పన్న ఈ గ్రామస్థుడు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nizam Andhra Mahasabha, Chilkur Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి