మోతె సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. మోతె సూర్యాపేట జిల్లాకు చెందిన మండలము. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూరు, విమోచనోద్యమంలో పాల్గొన్న కోట కృష్ణారెడ్డి, నల్గొండ జిల్లా జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన నడిగూడెం మండలం, మునగాల మండలం, పశ్చిమాన చివ్వెంల మండలం, ఉత్తరాన మరియు వాయువ్యాన ఆత్మకూరు (ఎస్) మండలం, తూర్పున ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42680, 2011 నాటికి జనాభా 1448 పెరిగి 44128 కు చేరింది. ఇందులో పురుషులు 22218, మహిళలు 21910. రాజకీయాలు: ఈ మండలము కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annariguda, Burkacherla, Gopalapuram, Hussenabad, Kudali, Mamillagudem, Mothey, Namaram, Nereduvai, Raavipahad, Raghavapuram, Sarvaram, Singarenipalli, Sirikonda, Thummalapalli, Urlugonda, Vibhalapuram
ప్రముఖ గ్రామాలు
సిరికొండ (Sirikonda):నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఉప్పల మల్సూరు ఈ గ్రామానికి చెందినవారు. 1928లో జన్మించిన ఉప్పల మల్సూరు తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొని రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించారు. 1952లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నందున పీడీఎఫ్ తరఫున పోటీచేసి సూర్యాపేట నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత సీపీఐ నుంచి రెండుసార్లు గెలుపొందారు. 1964లో సీపీఐలో చీలిక రావడంతో 1967 ఎన్నికలలో సీపీఎం తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత గ్రామ సర్పంచిగా పనిచేస్తూ 1999లో మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mothey Mandal, Suryapet Dist (district) Mandal in telugu, Suryapet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి