రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. ఇస్సన్నపల్లి-రామారెడ్డి సరిహద్దులో కాలభైరవస్వామి ఆలయం ఉంది. 1967లో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి పైడి మధుసూధన్ రెడ్డి ఈ మండలమనకు చెందినవారు. మండలం పశ్చిమభాగం మీదుగా సికింద్రాబాదు - నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు మాచారెడ్డి మరియు సదాశివనగర్ మండలాలలోని 15 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున నిజామాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున మరియు ఆగ్నేయాన మాచారెడ్డి మండలం, దక్షిణాన కామారెడ్డి మండలం, పశ్చిమాన సదాశివనగర్ మండలం, ఉత్తరాన నిజామాబాదు జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం ఎల్లారెడ్డి మరియు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు. 2019 ZPTC ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నారెడ్డి మోహన్ రెడ్డి విజయం సాధించారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Ghanpoor (R), Gidda, Gollapalle, Issannapalle, Kannapur, Maddikunta, Moshampur, Posanipet, Radhaipalle, Ramareddy, Rangampet, Reddypet, Singaraipally, Uppalwai
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఇస్సన్నపల్లి (Isannapally):ఇస్సన్నపల్లి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ కాలభైరవస్వామి ఆలయం ఉంది. దీనిని దోమకొండ సంస్థానాధీశులు నిర్మించారు. రథాల రామారెడ్డి (Rathalaramareddy): రథాల రామారెడ్డి నిజామాబాదు జిల్లా సదాశివనగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది దోమకొండ సంస్థానాధీశుల అధీనంలో ఉండేది. గ్రామంలో రామాలయం, శివాలయం ఉన్నాయి. ఇవి రెండూ లోపల విగ్రహాలు తప్ప అంతా ఒకే విధంగా ఉన్నాయి. ఈ ఆలయాలను కట్టించినది దోమకొండ సంస్థానాధిపతి మల్లారెడ్డి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Ramareddy Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి