హవేలీ ఘన్‌పూర్ మెదక్ జిల్లాకు చెందిన మండలము.అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు మెదక్ మండలంలో ఉన్న 22 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజన్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు పశ్చిమాన కామారెడ్డి జిల్లా, తూర్పున రామాయంపేట మండలం, దక్షిణాన మెదక్ మండలం, నైరుతిన పాపన్నపేట మండమం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthasagar, Aurangabad, Bogada Bhoopathipur, Burugupally, Byathole, Byathole Thimmaipally, Fareedpur, Gangapur, Havelighanpur, Kuchanpally, Lingasanpally, Madulwai, Mirgudpally (DP), Muthaipally, Nagapur, Rajpet, Sardhana, Serikuchanpally, Shalipet, Shamnapur, Suklalpet, Thogita
ప్రముఖ గ్రామాలు
కూచన్‌పల్లి (Kuchanpalli): కూచన్ పల్లి మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. మే 31, 2020న ఈ గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైనారు. ఈయన ABVP, RSSలలో పనిచేశారు. ముత్తాయిపల్లి (Muttaipally): ఈ గ్రామానికి చెందిన ఆర్.నర్సింహారెడ్డి మెదక్ జడ్పీ తొలి చైర్మెన్‌గా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Haveli Ghanpur Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి