చేగుంట మెదక్ జిల్లాకు చెందిన మండలము. 7వ నెంబరు (కొత్తది 44) జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. డిసెంబరు 24, 2020న ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటైన మాసాయిపేట మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం మెదక్ జిల్లాలో తూర్పువైపున సిద్ధిపేట జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన నిజాంపేట మండలం, దక్షిణాన తూఫ్రాన్ మండలం, పశ్చిమాన ఎల్దుర్తి, శంకరంపేట-ఆర్ మండలాలు, వాయువ్యాన రామాయంపేట మండలం, తూర్పున సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58717. ఇందులో పురుషులు 29008, మహిళలు 29709. అక్షరాస్యుల సంఖ్య 30051. పట్టణ జనాభా 5701, గ్రామీణ జనాభా 53016. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthasagar, Bonal, Chandaipet, Chegunta , Chinna Shivnoor, Gollapally, Ibrahimpur, Kasanpally, Kistapur, Kondapur [Bonal], Makkarajpet, Pedda Shivnoor, Polampally, Pulimamidi, Ramapur, Reddipally, Rukmapur, Ulli Thimmaipally, Vallabhapur, Wadiaram
ప్రముఖ గ్రామాలు
...... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chegunta Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి