కల్హేర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. జిల్లాలొ ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు మండల పరిధిలోని సుల్తానాబాదు శివారులో ఉంది. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న కల్హేర్ మండలంలోని 9 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన సిర్గాపూర్ మండలంలో కలిపారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉత్తరం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. దక్షిణాన నారాయణఖేడ్ మండలం, పశ్చిమాన సిర్గాపూర్ మండలం, ఉత్తరాన మరియు తూర్పున కామారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51529. ఇందులో పురుషులు 26161, మహిళలు 25368. అక్షరాస్యుల సంఖ్య 22167. అక్షరాస్యత శాతం 49.05%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి తొలి స్థానంలో ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bachepally, Bibipet, Fathepoor, Kalher, Khanapoor (B), Khanapur (Kadeem), Krishnapoor, Mahadev pally, Malharpur (DP), Mardi, Masan pally, Meerkhanpet, Mungepally, Nagdhar, Ramreddi Pet, Raparthy
ప్రముఖ గ్రామాలు
బీబీపేట (Bibipet):బీబీపేట సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలానికి చెందిన గ్రామము. జూన్ 2019లో ఓఎన్‌జీసి చమురు నిక్షేపాల అన్వేషణ జరిపింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kalher Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి