నాగిల్‌గిద్ద సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు మనూరు మండలంలో ఉన్న 21 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో పశ్చిమవైపున కర్ణాటక సరిహద్దులో ఉంది. ఉత్తరాన కంగ్టి మండలం, ఈశాన్యాన సిర్గాపూర్ మండలం, తూర్పున నారాయణఖేడ్ మండలం, ఆగ్నేయన మనూరు మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి రాజకీయాలు: ఈ మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Audathpur, Enkapally, Errakipally, Gondegaon, Goudgaon (Janwada), Gudur, Karsgutti, Keshwar, Kharamungi, Mavanhalli, Morgi, Mukthapur, Nagalgidda, Pusalpahad, Shapur, Sheri Damaragidda, Shikarkhana, Utpally, Valloor, Yarraboguda, Yesgi
ప్రముఖ గ్రామాలు
ఎర్రాకిపల్లి (Errakipalli):2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2846. మండలంలో ఇదే పెద్ద గ్రామము. గౌడ్‌గాం (Goudgaoan): మంజీరానది సంగారెడ్డి జిల్లాలో ఈ గ్రామంలోనే ప్రవేశిస్తుంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Nagilgidda Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి