కంగ్టి (కాంగిటి) సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో అతి ఉత్తరాన కర్ణాటక రాష్ట్రం మరియు కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. 1986కు ముందు ఇది నారాయణఖేడ్ తాలుకాలో ఉండేది. 2001 లెక్కల ప్రకారము మండల జనాభా 44,769. మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు కలవు.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న కంగిటి మండలంలోని 7 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన సిర్గాపూర్ మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో అతి ఉత్తరాన కర్ణాటక రాష్ట్రం మరియు కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన నాగిల్గిద్ద మండలం మరియు సింగాపూర్ మండలాలు, ఉత్తరాన మరియు తూర్పున కామారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52450. ఇందులో పురుషులు 26795, మహిళలు 25655. అక్షరాస్యుల సంఖ్య 22133. అక్షరాస్యత శాతం 49.16%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో చివరి నుంచి రెండవ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Babulgaon, Bhanswada, Bheemra, Borgi Aurad, Chapta [Khurd], Chapta kalan, Chowkanpally, Damaragiddi [Panchamahal], Degulawadi, Enkemori, Gajulpahad, Ghanpur, Jamgi kalan, Jamgikhurd, Kangti, Murkunjal, Naganpally, Nagoor [B], Nagoor [K], Ramathirath, Rasole, Sidhangarga, Sukalteerth, Tadkal, Turkwadgaon, Valmoor (DP), Yampally
ప్రముఖ గ్రామాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
About Kangti Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి