కోహిర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. పూనే-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి, వికారాబాదు - పర్భని రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నవి. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలకేంద్రం కోహీర్ గ్రామం చారిత్రక ప్రాశస్త్యం కలది. ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజన్, జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండల కేంద్రం కోహీర్ జామపండ్లకు ప్రసిద్ధి.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా కోహీర్ మండలం సంగారెడ్డి జిల్లాలో దక్షిణాన కర్ణాటక రాష్ట్రం మరియు వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన ఝారసంగం మండలం, ఈశాన్యాన మునిపల్లి మండలం, పశ్చిమాన జహీరాబాదు మండలం, తూర్పున మరియు దక్షిణాన వికారాబాదు జిల్లా, నైరుతిన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60622. ఇందులో పురుషులు 30494, మహిళలు 30128. అక్షరాస్యుల సంఖ్య 35134. రాజకీయాలు: ఈ మండలం జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Badampet, Bilalpur, Chinthalghat, Digwal, Godgarpally, Gurjuwada, Kavelli, Khanapur, Kohir, Kothur Patti Digwal, Kothur Pattikohir, Machreddipally, Madri, Maniyarpally, Nagireddy pally, Paidigummal, Parsapally, Picharagad, Pothireddypally, Rajnelli, Sajjapur, Siddapur Patti kohir, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కోహిర్ (Kohir): కోహీర్ చారిత్రాత్మకమైన గ్రామం. జైన పార్శ్వనాథుని తలభాగం, శైవ మతాలకోసం ప్రాణత్యాగం చేసిన వీరకల్లు విగ్రహం గ్రామంలో లభించాయి. కాకతీయులు, బహమనీలు, ఆసఫ్‌జాహీల కాలంలో ఈ గ్రామం ప్రముఖ పాత్ర వహించింది. కాకతీయుల కాలంలో ఎక్కలదేవి ఆలయం నిర్మించారు. ముస్లింల దండయాత్రలలో ఆలయం ధ్వంసమైంది. బీదర్‌కు చెందిన అలీబదిరీ అధీనంలో ఉన్న కాలంలో గోల్కొండ నవాబు కులీకుతుబ్‌షా దండెత్తి కోహీరును వశపర్చుకున్నాడు. కోహీరులో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఎర్రరాతి శిల్పాలు, కాకతీయుల కాలం నాటి నల్లరాతి శిల్పాలు గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ గ్రామం జామపండ్లకు ప్రసిద్ధి. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Kohir or Koheer Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి