మొగుడంపల్లి సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు జహీరాబాదు మండలంలో ఉన్న 16 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజన్, జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో గ్రామపరిధిలో జాడిమల్కాపూర్ వద్ద జలపాతం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: మొగుడంపల్లి మండలం సంగారెడ్డి జిల్లాలో పశ్చిమం వైపున కర్ణాటక రాష్ట్రం సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున మరియు ఉత్తరాన జహీరాబాదు మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Asadgunj, Auranganagar, Dhanasiri, Godgarpally (Patti Dhanasiri), Gopanpally, Gousabad, Gudpally, Ippepally, KhanJamalapur, Madgi, Malkapur [Jadi], Mannapur, Mogudampally, Parvathapur, Raipally [Patti Dhanasiri], Sarjaraopet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జాడి మల్కాపూర్ (Jadi Malkapur): జాడి మల్కాపూర్ సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంనకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో జాడిమల్కాపూర్ జలపాతం ఉంది. సర్జారావుపేట (Sarjaraopet): సర్జారావుపేట సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంనకు చెందిన గ్రామము. అక్టోబరు 10, 2018న గ్రామంలో భవానీమాత విగ్రహం ఆవిష్కరించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Mogudampalli or Mogudampally Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి