కుల్చారం మెదక్ జిల్లాకు చెందిన మండలము. వందేళ్ళ క్రితం నిర్మించిన ఘన్‌పూర్ ఆనకట్ట మండల పరిధిలో ఉంది. మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్, నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఎల్దుర్తి మండలం, దక్షిణాన కౌడిపల్లి మండలం, పశ్చిమాన టేక్మల్ మండలం, ఉత్తరాన పాపన్నపేట మండలం, ఈశాన్యాన మెదక్ మండలం, నైరుతిన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా మంజీరానది ప్రవహిస్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35881. ఇందులో పురుషులు 17512, మహిళలు 18369. అక్షరాస్యుల సంఖ్య 17268. స్త్రీపురుష నిష్పత్తిలో (1049/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం నర్సాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Amsanpally, Appajipally, Chinnaghanpur, Etigadda Mahmmadapur, Kistapur, Konapur, Kongode, Kulcharam, Nainjalalpur, Paithara, Pothamsettipally, Pothireddipally, Rampur, Rangampet, Sangaipet, Serivariguntham, Thukkapur, Tummalapally, Variguntham, Venkatapur, Yenigandla
ప్రముఖ గ్రామాలు
చిన్న ఘన్‌పూర్ (China Ghanpur): ఈ గ్రామపరిధిలో మంజీరానదిపై 1905లో ఆనకట్ట నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kowdipally Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి