మనోహరబాద్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. అదివరకు తూఫ్రాన్ మండలంలో ఉన్న 14 గ్రామాలను, శివంపేట మండలంలోని 2 గ్రామాలను విడదీసి 16 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం గుండా జాతీయ రహదారి నెంబర్ 44 మరియు రైలుమార్గం వెళ్ళుచున్నది. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన తూఫ్రాన్ మండలం, పశ్చిమాన శివంపేట మండలం, తూర్పున సిద్ధిపేట జిల్లా, దక్షిణాన మేడ్చల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chatla Gouraram, Dharmarajpally, Jeedipally, Kallakal, Konaipally (Patti Toopran), Kondapur, Kucharam, Lingareddipet, Manoharabad, Muppireddipally, Palat, Parkibanda, Potharam, Ramaipally, Rangaipally, Venkatapur Agraharam,
ప్రముఖ గ్రామాలు
మనోహరబాదు (Manoharbad): తూఫ్రాన్ మండల పరిధిలో ఉన్న ఈ గ్రామం అక్టోబరు 11, 2016న కొత్తగా మండల కేంద్రంగా మారింది. మనోహరబాదు గ్రామానికి రైలు సదుపాయము ఉంది. మనోహరబాదు రైల్వేస్టేషన్ సికింద్రబాదు నుంచి 30 కిమీ దూరంలో మన్మాడ్ మార్గంలో ఉంది. ఇక్కడి నుంచి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వరకు మరియు మహబూబ్ నగర్ వరకు కొత్తలైన్ ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kowdipally Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి