నర్సాపూర్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. భౌగోళికంగా ఇది జిల్లా దక్షిణాన సంగారెడ్డి జిల్లా సరిహదులో ఉంది. రెండు జాతీయ రహదారులను కలిపే రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలము నర్సాపుర్ రెవెన్యూ డివిజన్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఆవంచలో సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు
భౌగోళికం, సరిహద్దులు: నర్సాపూర్ మండలము భౌగోళికంగా మెదక్ జిల్లాలో దక్షిణాన ఉంది. తూర్పున శివ్వంపేట మండలం, ఉత్తరాన కౌడిపల్లి మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారం నర్సాపూర్ మండల జనాభా 47919. ఇందులో పురుషులు 24159 మరియు మహిళలు 23760. మండల అక్ష్యరాస్యత 50.52%. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53785. ఇందులో పురుషులు 27297, మహిళలు 26488. అక్షరాస్యుల సంఖ్య 30039. రాజకీయాలు: ఈ మండలము నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014 జడ్పీ చైర్మెన్ ఎన్నికలో నర్సాపూర్ జడ్పీటీసిగా ఎన్నికైన ఎర్రగొల్ల రాజమణి జడ్పీ చైర్మెన్ అయ్యారు. రవాణా సదుపాయాలు: సంగారెడ్డి, మెదక్ పట్టణాల నుంచి నర్సాపూర్‌కు రోడ్డు మార్గాంలో మంచి రవాణా సదుపాయాలున్నాయి. 7వ నెంబరు మరియు 9వ నెంబరు జాతీయ రహదారులను కలిపే రహదారి నర్సాపూర్ నుంచి వెళ్ళుతుంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achampet, Admapur, Ahmednagar, Awancha, Brahmanpally, Chinna Chintakunta, Chippalturthi, Dharmaram (DP), Gollapally, Hanmanthapur, Ibrahimbad, Jakkupally, Kagazmaddur, Khazipet, Kondapur, Lingapur, Madapur, Malparthy (DP), Manthoor, Mohammadabad @ Janakampet, Moosapet, Nagulpally, Naimatullaguda, Narayanpur, Narsapur, Nathinoipally, Pedda Chintakunta, Ramachandrapur, Reddipally, Rustumpet, Sitarampur, Thirmalapur, Tujalpur, Tuljarampet, Yellapur
ప్రముఖ గ్రామాలు
నర్సాపుర్ (Narsapur)::ప్రకృతి దృష్యాలకు నిలయమైన నర్సాపూర్ హైదరాబాదు నుంచి 60 కిమీ దూరంలో ఉన్నది. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. గ్రామానికి సమీపంలో అరణ్యాలు, కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలు చిత్రీకరణ జరిగింది. వి.బి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి గ్రామంలోఉంది. . ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narsapur Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి