ఈ మండలం మెదక్ జిల్లాకు చెందిన మండలము. మెదక్ పట్టణంలో ప్రాధాన్యత కలిగిన చర్చి (మెదక్ చర్చి), కాకతీయుల కాలం నాటి కోట ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 114808. అక్టోబరు 11, 2016న మెదక్ మండలంలోని 22 గ్రామాలను విడదీసి కొత్తగా హవేలీ ఘన్‌పూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పుడు మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగిలాయి. 2014, జనవరి 19: మెదక్-అక్కన్నపల్లి నూతన రైలుమార్గానికి శంకుస్థాపన జరిగింది
భౌగోళికం, సరిహద్దులు: మెదక్ మండలానికి ఉత్తరాన హవేలిఘన్‌పూర్ మండలం, ఈశాన్యాన రామాయంపేట మండలం, తూర్పున శంకరంపేట-ఆర్ మండలం, దక్షిణాన ఎల్దుర్తి, కుల్చారం మండలాలు, పశ్చిమాన పాపన్నపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 114808. ఇందులో పురుషులు 55558, మహిళలు 59250. అక్షరాస్యుల సంఖ్య 64181. పట్టణ జనాభా 46736, గ్రామీణ జనాభా 68072. స్త్రీపురుష నిష్పత్తిలో (1066/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది. (జనాభా వివరాలు హవేలీఘన్‌పూర్ మండలంతో కలిపి) రాజకీయాలు: ఈ మండలము మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఈ మండలానికి చెంద్న ఆర్.నర్సింహారెడ్డి జడ్పీ తొలి చైర్మెన్‌గా పనిచేయగా, పి.జగపతిరావు కూడా జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ausulapally, Balanagar, Chityal, Khazipally, Komtoor, Makta Bhoopathipur, Maqdumpur, Medak, Pashapur, Pathur, Perur, Rajpally, Rayalamadugu, Rayanpally, Venkatapur
ప్రముఖ గ్రామాలు
ఖాజీపల్లి (Khajipally):ఈ గ్రామానికి చెందిన పి.జగపతిరావు మెదక్ జడ్పీ చైర్మెన్‌గా పనిచేశారు. పేరూరు (Perur): మంజీరానది అంత్య పుష్కరాలు ఏప్రిల్ 2012లో నిర్వహించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Medak or methukuseema Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి