ఎల్దుర్తి మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో వచ్చిన మాభూమి సినిమాను మండలంలోని మంగళ్‌పల్లి గ్రామంలో చిత్రీకరించారు. ప్రముఖ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు వెల్దుర్తి మాణిక్యరావు ఈ మండలానికి చెందినవారు. డిసెంబరు 24, 2020న ఈ మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటైన మాసాయిపేట మండలంలో కలిపారు.
జాతీయరహదారి నెంబర్ 44 మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం మండలం తూర్పు భాగం గుండా వెళ్ళుచున్నాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం మెదక్ జిల్లాలో దాదాపు మధ్యలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన శంకరంపేట-ఆర్ మండలం, తూర్పున చేగుంట మండలం, ఆగ్నేయాన తూఫ్రాన్ మండలం, దక్షిణాన శివంపేట మండలం, పశ్చిమాన కౌడిపల్లి, కుల్చారం మండలాలు, వాయువ్యాన మెదక్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42319. ఇందులో పురుషులు 20842, మహిళలు 21477. అక్షరాస్యుల సంఖ్య 20464. రాజకీయాలు: ఈ మండలం నర్సాపుర్ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
ఎల్దుర్తి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Andugulapally, Bandaposanipally, Damarancha, Dharmaram, Edulapally, Eshvantharaopet, Hastalpur, Kuknoor, Manepally, Mangalparthy, Mannevar Jalalpur, Mellor, Peddapur, Settipally Kalan, Uppulingapur, Yeldurthy కాలరేఖ:
ప్రముఖ గ్రామాలు
ఎల్దుర్తి (Yeldurthy):ఎల్దుర్తి మెదక్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ప్రముఖ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు వెల్దుర్తి మాణిక్యరావు ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Yeldurthy or veldurthy Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి