జహీరాబాదు సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు కలవు. 65వ (పాతపేరు 9వ) నెంబరు జాతీయ రహదారి మరియు వికారాబాదు - బీదర్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జహీరాబాదు మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా మొగుడంపల్లి మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: జహీరాబాదు మండలం సంగారెడ్డి జిల్లాలో పశ్చిమం వైపున కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన న్యాలకల్ మండలం, ఈశాన్యాన ఝారసంగం మండలం, ఆగ్నేయాన కోహీర్ మండలం, పశ్చిమాన మొగుడంపల్లి మండలం, వాయువ్యాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 169222. ఇందులో పురుషులు 85883, మహిళలు 83339. అక్షరాస్యుల సంఖ్య 99074. పట్టణ జనాభా 82607, గ్రామీణ జనాభా 86615. (కొత్తగా ఏర్పటైన మొగుడంపల్లి మండలంతో కలిపి) రవాణా సౌకర్యాలు: మండలానికి రైలుమార్గం మరియు జాతీయ రహదారి సౌకర్యం ఉంది. వికారాబాదు - బీదర్ రైలుమార్గం జహీరాబాదు పట్టణం గుండా వెళ్ళుచున్నది. 9వ నెంబరు జాతీయ రహదారి (పూనే-విజయవాడ) కూడా జహీరాబాదు పట్టణం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలం జహీరాబాదు నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Algole, Allipur, Anegunta, Buchnelli, Burdipahad, Chinna Hyderabad, Chiragpally, Didgi, Govindpur, Hothi [B], Hothi [K], Huggelli, Kasimpur, Kothur [B], Malchelma, Pasthapur, Raipally patti Digwal, Ranjole, Sathwar, Shekapur, Thammadpalli, Tumkunta, Zahirabad (M )
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొత్తూరు (బి) (Kothur B): కొత్తూరు (బి) సంగారెడ్డి జిల్లా జహీరాబాదు మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో నారింజవాగు ప్రాజెక్టు నిర్మించబడింది. జహీరాబాదు (Zaheerabad) జహీరాబాదు సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణము. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రము మరియు అసెంబ్లీ & లోక్‌సభ నియోజకవర్గం కేంద్రం కూడా. ఈ పట్టణం పురపాలక సంఘంగా కొనసాగుతోంది. పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంది. వికారాబాదు నుంచి బోదర్ వెళ్ళు రైలుమార్గంలో జహీరాబాదు రైల్వేస్టేషన్ ఉంది. విజయవాడ - పూనె జాతీయ రహదారి కూడా పట్టణం మీదుగా వెళ్ళుచున్నది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Zaheerabad / Jaheerabad / Zahirabad Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి