నార్సింగి మెదక్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు శంకరంపేట (ఆర్), దుబ్బాక మండలాలలోని 7 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం తూఫ్రాన్ రెవెన్యూ డివిజన్, దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున రామాయంపేట మండలం, దక్షిణాన చేగుంట మండలం, పశ్చిమాన శంకరంపేట (ఆర్) మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలు, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రవాణా సదుపాయాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నాయి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Sankhapur, Zapthishivnur, Sheripally (ఈ గ్రామాలు శంకరంపేట-ఆర్ మండలం నుంచి తీసుకోబడ్డాయి), Narsingi, Narsampally, Bheemraopally, Valloor ( ఈ గ్రామాలు దుబ్బాక మండలం నుంచి తీసుకోబడ్డాయి)
ప్రముఖ గ్రామాలు
నార్సింగి (Narsingi):నార్సింగి మెదక్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రం. అక్టోబరు 11, 2016కు ముందు ఈ గ్రామం చేగుంట మండలంలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది.. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narsingi Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి