రామాయంపేట్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. 7వ నెంబరు (కొత్తది 44) జాతీయరహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. సికింద్రాబాదు నుంచి నిజామాబాదు వెళ్ళు రైలుమార్గం కూడా మండలం గుండా వెళ్ళుచున్నది. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు మరో కొత్త మార్గానికి 2014, జనవరి 20న శంకుస్థాపన జరిగింది. అక్టోబరు 11, 2016న మండలంలోని 8 గ్రామాలను విడదీసి కొత్తగా నిజాంపేట్ మండలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: రామాయంపేట మండలం మెదక్ జిల్లాలో ఉత్తరం వైపున కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నిజాంపేట మండలం, దక్షిణాన నార్సింగి, శంకరంపేట (ఆర్) మండలాలు, పశ్చిమాన మెద, హవేలి ఘన్‌పూర్ మండలాలు, ఆగ్నేయాన చేగుంట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68870. ఇందులో పురుషులు 33994, మహిళలు 34876. అక్షరాస్యుల సంఖ్య 36116. (నిజాంపేట్ మండలం కలిపి) రాజకీయాలు: ఈ మండలం మెదక్ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. రవాణా సదుపాయాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-నిజామాబాదు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akkannapet, Damaracheru, Dantepally, Dongal Dharmaram, Jhansi Lingapur, Katrial, Komatipally, Konapur, Lakshmapur, Parvathapur, Ramayampet, Rayalapur, Sadasivnagar, Sivaipally, Sutarpally, Thonigandla
ప్రముఖ గ్రామాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Ramayampet Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి