రేగోడ్ మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న రేగోడ్ మండలంలోని 8 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటుచేసిన సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలంలో కలిపారు. ప్రస్తుతం మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు కలవు. తాటిపర్తిలో సౌరప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు.
భౌగోళికం, సరిహద్దులు: రేగోడ్ మండలం మెదక్ జిల్లాలో అతిపశ్చిమాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున శంకరంపేట (ఏ), అల్లాదుర్గ్ మండలాలు సరిహద్దులుగా ఉండగా మిగితా 3 వైపులా సంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది. జనాభా: రేగోడ్‌లో 3732 జనాభా, చౌదర్‌పల్లిలో 1473 జనాభా, మర్పల్లిలో 2338 జనాభా, కొత్వాన్‌పల్లిలో 1471 జనాభా, జగిర్యాలలో 1020 జనాభా, ఆర్.ఇటిక్యాలలో 1529 జనాభా, దోసపల్లిలో 2251 జనాభా, కొండాపురంలో 1727 జనాభా, ప్యారారంలో 1077 జనాభా, టి.లింగంపల్లిలో 1412 జనాభా, సిందోల్‌లో 2200 జనాభా, గజ్వాడలో 2303 జనాభా ఉంది. మండల జనాభా 22533. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Burhanwadi, Chowderpally, Dosapally, Gajwada, Jagriyal, Kondapur, Kothwalpally, Lingampally, Marpally, Pocharam, Pyararam, R. Itikyal, Regode, Sindole, Tatpally, Timmapur, Venkatapur [Maktha]
ప్రముఖ గ్రామాలు
తాటిపర్తి (Tatiparthy):తాటిపర్తి మెదక్ జిల్లా రేగోడ్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ సౌరప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు.. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Regode Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి