శివంపేట మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలంలోని 2 గ్రామాలను (పోతారం, పర్కిబండ) కొత్తగా ఏర్పాటు చేసిన మనోహరబాద్ మండలంలో కలిపారు. ప్రస్తుతం 25 రెవెన్యూ గ్రామాలున్నాయి. భౌగోళికం, సరిహద్దులు: శివంపేట మండలం మెదక్ జిల్లాలో దక్షిణం వైపున సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున తూఫ్రాన్, మనోహరబాద్ మండలాలు, పశ్చిమాన నర్సాపూర్ మండలం, ఉత్తరాన ఎల్దుర్తి మండలం, దక్షిణాన సంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 42428. ఇందులో పురుషులు 21258, మహిళలు 21170. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45115. ఇందులో పురుషులు 22480, మహిళలు 22635. అక్షరాస్యుల సంఖ్య 22682. రాజకీయాలు: ఈ మండలము నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగము. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allipur, Bijilipur, Chandi, Chennapur, Chinnagottimukkala, Donthi, Edulapur, Gangaipally, Gomaram, Gundlapally, Konthanpally, Kothapet, Lingojiguda, Maqdumpur, Nawabpet, Pambanda, Pedda Gottimukkala, Pillutla, Pothula Boguda, Ratnapoor, Shabashpally, Shivampet, Sikindlapur, Thimmapur, Usirikapally
ప్రముఖ గ్రామాలు
అల్లీపూర్ (Allipur):అల్లీపూర్ మెదక్ జిల్లా శివంపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో పెద్దచెరువు ఉంది. 2018 మే 11న మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మంత్రి కె.హరీష్ రావు చెరువు పునరుద్ధరణ పరునులు ప్రారంభించారు. గోమారం (Gomaram) : గోమారం మెదక్ జిల్లాకు చెందిన మండలము. ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకురాలు, తెలంగాణ తొలి మహిళా కమీషన్ చైర్మెన్‌గా నియమితులైన వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. గొట్టిముక్కల (Gottimukkala): గొట్టిముక్కల మెదక్ జిల్లా శివంపేట మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి చెందిన ఎస్.నర్సింగరావు కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్‌గా, సింగరేణి సీఎండిగా పనిచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Shivampet Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి